IPL : ధోనీ ఆడకపోతే నేనూ ఆడను!

తాజా వార్తలు

Published : 10/07/2021 12:03 IST

IPL : ధోనీ ఆడకపోతే నేనూ ఆడను!

మహీభాయ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తా: రైనా

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్‌ ధోనీ ఆడకపోతే తానూ ఐపీఎల్‌కు దూరమవుతానని స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో చెన్నై గెలిస్తే మరో రెండేళ్లు కొనసాగేందుకు మహీ భాయ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.

‘నేను మరో నాలుగైదేళ్లు ఆడగలను. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఇంకా ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు రాబోతున్నాయి. నేను మాత్రం సీఎస్‌కేకు మాత్రమే ఆడతానని అనుకుంటున్నా. ఈ ఏడాది మేం రాణిస్తామని ధీమాగా ఉన్నాను’ అని అని రైనా అన్నాడు.

‘వచ్చే ఐపీఎల్‌ సీజన్లో ధోనీ భాయ్‌ ఆడకపోతే నేనూ ఆడను. 2008 నుంచి మేం సీఎస్‌కేకు ఆడుతున్నాం. ఈ ఏడాది మేం గెలిస్తే వచ్చే సీజన్‌ ఆడేందుకు ధోనీ భాయ్‌ను ఒప్పిస్తాను. సఫలం అవుతాననే అనుకుంటున్నా. ఒకవేళ అతనాడకపోతే నేనింక ఏ జట్టుకూ ఆడను’ అని రైనా తెలిపాడు.

గతేడాది ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మహీ ప్రకటించిన అరగంటకే రైనా సైతం గుడ్‌బై చెప్పేశాడు. గతేడాది ఐపీఎల్‌కు దూరమైన రైనా ఈ ఏడాది ఫర్వాలేదనిపించాడు. కరోనా వైరస్‌ కారణంగా సీజన్‌ మధ్యలోనే నిరవధికంగా వాయిదా పడింది. రెండు రోజుల క్రితమే ధోనీ 40వ పుట్టినరోజు జరుపుకోవడంతో ఇక ఐపీఎల్‌కూ దూరమవుతాడని వార్తలు వచ్చాయి. వాటిని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ ఖండించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని