close

తాజా వార్తలు

Published : 27/01/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాక్సీకి రూ.10 కోట్లు చెల్లిస్తే తెలివిలేనట్లే!

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ను ఏ ఫ్రాంఛైజీ అయినా రూ.10 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంటే, అది తెలివి తక్కువ పనే అవుతుందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ స్కాట్ స్టైరిస్‌ అన్నాడు. తన ఉద్దేశం మాక్సీకి ప్రతిభ లేదని కాదని, కానీ లీగ్‌లో గత అయిదారేళ్లగా అతడు పూర్తిగా విఫలమవుతున్నాడని తెలిపాడు.

2020 ఐపీఎల్ వేలంలో మాక్స్‌వెల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గత సీజన్‌లో అతడు పేలవమైన ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. ఒక్క సిక్సర్‌ సాధించకపోవడం గమనార్హం. అంతేకాకుండా స్పిన్నర్‌గానూ విఫలమయ్యాడు.

‘‘వేలంలో మాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లకు తీసుకుంటే అంతకంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. ఇది చాలా సింపుల్‌. అతడు మంచి ఆటగాడని అందరికీ తెలుసు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ తన సామర్థ్యాన్ని మాక్సీ చాటిచెప్పలేకపోతున్నాడు. అయితే మాక్స్‌వెల్‌ను తీసుకోవాలంటే కనీస ధరను వెచ్చించి తీసుకోవాలి. అప్పుడు అతడు సత్తాచాటితే ఆ ఫ్రాంఛైజీకీ అదృష్టమే. గత అయిదు-ఆరు సీజన్ల నుంచి ఉత్తమ ప్రదర్శన చేయట్లేదు. కానీ ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అతడు వచ్చే సీజన్‌లో కసితో ఆడే అవకాశం ఉంది’’ అని స్టైరిస్ తెలిపాడు. వచ్చే నెలలో ఐపీఎల్ వేలం జరగనుంది.

ఇదీ చదవండి

దాదా కాల్ చేశాడు.. క్రెడిట్ ద్రవిడ్‌కే: రహానె

అంచనాలు వద్దు.. ఒత్తిడి పెంచొద్దు: గంభీర్‌



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని