
తాజా వార్తలు
250 దాటిన ఆస్ట్రేలియా
గబ్బా: టీమ్ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టిమ్‌పైన్(23*), గ్రీన్(20*) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు లబుషేన్(108*) జట్టు స్కోర్ 213 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 82 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌ను 251/5కి చేర్చారు. భారత బౌలర్లలో ఇప్పటివకు నటరాజన్ 2 వికెట్లు తీయగా సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకుర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Tags :