IND vs Eng: నెట్స్‌లో చెమటోడ్చుతున్న కోహ్లీ సేన

తాజా వార్తలు

Published : 28/07/2021 01:36 IST

IND vs Eng: నెట్స్‌లో చెమటోడ్చుతున్న కోహ్లీ సేన

(Photo:BCCI Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సమయం దగ్గరపడుతోంది. ఆగష్టు 4న తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. దీంతో కోహ్లీసేన మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది. బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, చతేశ్వర్‌ పుజారా, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, అజింక్యా రహానెలతోపాటు ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న రిషభ్‌పంత్‌ డుర్హమ్‌ క్రికెట్‌ క్లబ్‌లోని నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు.

 భారత ఆటగాళ్లు సాధన చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ ‘‘ ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం డుర్హమ్‌ క్రికెట్‌ క్లబ్‌లో టీమ్‌ఇండియా సాధన మొదలెట్టింది’’ అని ట్వీట్‌ చేసింది. మరోవైపు, శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలో శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టులో కరోనా కలకలం సృష్టించింది. ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నేడు లంకతో జరగాల్సిన రెండో టీ20 బుధవారానికి (ఈ నెల 28) వాయిదాపడిన సంగతి తెలిసిందే.

 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని