INDvsSL: శ్రీలంకతో మ్యాచ్‌లు వాయిదా

తాజా వార్తలు

Published : 10/07/2021 01:11 IST

INDvsSL: శ్రీలంకతో మ్యాచ్‌లు వాయిదా

(Photo Source BCCI Twitter) 

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, శ్రీలంక జట్ల మధ్య నాలుగు రోజుల్లో ప్రారంభంకావాల్సిన పరిమిత ఓవర్ల క్రికెట్‌ మరో నాలుగు రోజులు వాయిదా పడింది. తాజాగా లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా వైరస్‌కు గురికావడమే అందుకు కారణం. దీంతో ఆ జట్టు ఆటగాళ్లంతా ఇప్పుడు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే జులై 13 నుంచి ప్రారంభంకావాల్సిన వన్డే మ్యాచ్‌లను 17 నుంచి తిరిగి రీషెడ్యూల్‌ చేసినట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. కాగా, శ్రీలంక జట్టు మూడు రోజుల క్రితమే ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా ఇళ్లకు వెళ్లకుండా ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నారు.

తొలుత ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌కు గురువారం వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. దాంతో అతడికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ క్రమంలోనే జట్టు సభ్యులందరికీ శుక్రవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా డేటా అనలిస్టు నిరోషన్‌కు కూడా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దాంతో ఆటగాళ్లందరినీ ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు. కాగా, ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు.. 21, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరగాల్సి ఉంది. ఇప్పుడు మారిన తేదీల ప్రకారం.. 17, 19, 21 తేదీల్లో వన్డేలు, 24, 25, 27 తేదీల్లో టీ20లు ఆడాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని