close

తాజా వార్తలు

Updated : 21/01/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మైదానంలోనే భారత్‌-ఆసీస్‌ పోటీదారులు

ప్రధాని నరేంద్రమోదీ

దిల్లీ: భారత్‌.. ఆస్ట్రేలియా మైదానంలోనే పోటీదారులని, బయట మాత్రం రెండు దేశాల బంధం దృఢమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌ గడ్డపై బుధవారం చిరస్మరణీయ విజయం సాధించిన భారత క్రికెట్‌ జట్టుకు ఆతిథ్య దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

‘‘ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో గొప్ప విజయాన్ని నమోదు చేసిన భారత క్రికెట్‌ జట్టుకు, ఆ దేశ ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు. ఆటలోని అత్యుత్తమ రెండు జట్లు, ఆటగాళ్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటం ఇది. ఆసీస్‌ జట్టు కూడా వీరోచితంగా ఆడింది. ఈ ఓటమి నుంచి టిమ్‌పైన్‌, ఆసీస్‌ టెస్టు బృందం తేరుకొని బలంగా పుంజుకుంటుంది ’’ మారిసన్‌ ట్వీట్‌ చేశారు. ఇందుకు ప్రధాని మోదీ బదులిస్తూ.. ‘‘కృతజ్ఞతలు స్కాట్‌ మారిసన్‌జీ. ఈ థ్రిల్లింగ్‌ సిరీస్‌లో ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చాయి. భారత్‌, ఆస్ట్రేలియా.. మైదానంలో మాత్రమే బలమైన పోటీదారులు. మైదానం వెలుపల దృఢమైన భాగస్వామ్యం కలిగిన దేశాలు’’ అని మోదీ చెప్పుకొచ్చారు. 

కంగారుల కంచుకోటగా పిలిచే బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. రహానె నాయకత్వంలో పుజారా భాగస్వామ్యంతో శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌పంత్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించారు. దీంతో 2-1తో టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

ఇవీ చదవండి..

ఆస్ట్రేలియన్‌ నోట ‘భారత్‌ మాతా కీ జై’

ప్రపంచమంతా సెల్యూట్‌ చేస్తోంది: రవిశాస్త్రి



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని