Tokyo olympics : భారత హాకీ జట్టు ఘన విజయం

తాజా వార్తలు

Updated : 27/07/2021 10:08 IST

Tokyo olympics : భారత హాకీ జట్టు ఘన విజయం

స్పెయిన్‌పై 3-0తో అదరగొట్టిన మన్‌ప్రీత్‌ సేన

టోక్యో: ఒలింపిక్స్‌ హాకీలో భారత పురుషుల జట్టు మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. చివరి మ్యాచులో 1-7 తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంది. పూల్‌-ఏ మూడో మ్యాచులో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (14వ నిమిషం), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (15ని, 51ని) చక్కని గోల్స్‌తో ఆకట్టుకున్నారు.

ఈ మ్యాచుకు ముందు ప్రపంచ నాలుగో ర్యాంకు టీమ్‌ఇండియా ఆరంభ పోరులో న్యూజిలాండ్‌ను 3-2తో ఓడించిన సంగతి తెలిసిందే. స్పెయిన్‌కు మాత్రం ఇప్పటికీ విజయం దక్కలేదు. అర్జెంటీనాపై 1-1తో డ్రా చేసుకోగా, 3-4 తేడాతో కివీస్‌ చేతిలో ఓడింది. కాగా మన్‌ప్రీత్‌సేన తన తర్వాతి మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో గురువారం తలపడనుంది.

ఘోర ఓటమి నుంచి తేరుకొని ఆడటం ఎవరికైనా కష్టమే! మన్‌ప్రీత్‌ సేన ఆ ఒత్తిడిని అధిగమించింది. ఆరంభంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి పది నిమిషాల్లో స్కోరు చేసే అవకాశం దొరకలేదు. తొమ్మిదో నిమిషంలో మన్‌ప్రీత్‌సింగ్‌ డిఫ్లెక్షన్‌ను సిమ్రన్‌జీత్‌ గోల్‌గా మలిచే అవకాశం త్రుటిలో చేజార్చుకున్నాడు. అతడు కొట్టిన బంతి గోల్‌పోస్ట్‌ మీదుగా వెళ్లింది.

మెల్లగా పుంజుకున్న స్పెయిన్‌కు 12వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ లభించినా అవకాశం వృథా చేసుకుంది. తొలి క్వార్టర్‌ చివర్లో భారత్‌ పదేపదే దాడులు కొనసాగించి విజయవంతమైంది. సిమ్రన్‌జీత్‌ తొలి గోల్‌ కొట్టాడు. ఆఖరి నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్‌పాల్‌ సద్వినియోగం చేసి భారత్‌ను 2-0తో మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 51వ నిమిషంలోనూ అతడే పెనాల్టీ స్ట్రోక్‌ రూపంలో మరో గోల్‌ కొట్టి భారత్‌కు ఘన విజయం అందించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని