ఆటగాళ్లందరికీ నెగెటివ్‌: ప్రాక్టీస్‌ షురూ

తాజా వార్తలు

Updated : 01/02/2021 21:52 IST

ఆటగాళ్లందరికీ నెగెటివ్‌: ప్రాక్టీస్‌ షురూ

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, ఇంగ్లాండ్ జట్ల ఆరు రోజుల క్వారంటైన్ వ్యవధి ముగిసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో టీమిండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికీ నెగెటివ్ వచ్చింది. దీంతో ఆటగాళ్ల సాధనకు గ్రీన్‌ సిగ్నల్ లభించింది. సోమవారం సాయంత్రం టీమిండియా ఔట్‌డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. రేపటి నుంచి నెట్స్‌లో సాధన చేయనుంది.

‘‘నేటితో భారత జట్టు క్వారంటైన్‌ ముగిసింది. ఆర్‌టీ-పీసీఆర్‌ మూడు కొవిడ్‌ టెస్టుల్లో నెగెటివ్ అని వచ్చింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఔట్‌డోర్‌ సెషన్‌ మొదలుకానుంది. రేపటి నుంచి నెట్‌ సెషన్లు ఉంటాయి’’ అని బీసీసీఐ తెలిపింది. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చిందని చెప్పింది. రేపు మధ్యాహ్నం నుంచి ఇంగ్లాండ్ జట్టంతా కలిసి ప్రాక్టీస్ చేస్తుందని వెల్లడించింది.

ముందే క్వారంటైన్‌ను ముగించిన బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్, బర్న్స్‌ శనివారం నుంచే ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధిచిన చిత్రాలను, వీడియోలను ఈసీబీ ట్విటర్‌లో పంచుకుంది. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా భారత్‌ శుక్రవారం తొలి టెస్టు ఆడనుంది.

ఇవీ చదవండి

కోహ్లీ మాట దాటాలంటే ఆటగాళ్లకు భయం

గావస్కర్‌ రికార్డుపై కోహ్లీ గురిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని