భారత్‌×ఇంగ్లాండ్‌: వీక్షణల్లో రికార్డులు బద్దలు!

తాజా వార్తలు

Published : 21/03/2021 02:05 IST

భారత్‌×ఇంగ్లాండ్‌: వీక్షణల్లో రికార్డులు బద్దలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌×ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసు అరుదైన ఘనత సాధించింది. వీక్షణల పరంగా ఐదేళ్ల క్రితంనాటి రికార్డును బద్దలు కొట్టింది. ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్‌ను ఏకంగా 10.3 కోట్ల మంది వీక్షించారు. నిమిషానికి సగటు వీక్షకుల (ఏఎంఏ) సంఖ్య 10.3 లక్షలుగా నమోదైందని తెలిసింది. కరోనా వైరస్‌ ముప్పుతో దాదాపుగా ఏడాది తర్వాత భారత గడ్డపై క్రికెట్‌ ఆరంభమైన సంగతి తెలిసిందే.

నాలుగు మ్యాచుల టెస్టు సిరీసులో తొలుత ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఆ జట్టు సారథి జో రూట్‌ ద్విశతకంతో దుమ్మురేపాడు. దాంతో టీమ్‌ఇండియాపై అమాంతం ఒత్తిడి పెరిగింది. రెండో టెస్టులో తమ బలమైన స్పిన్‌ అస్త్రం ప్రయోగించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొతేరాకు వచ్చాకా జైత్రయాత్ర కొనసాగించింది. డే/నైట్‌ టెస్టును రెండున్నర రోజుల్లోనే ముగించి ఔరా! అనిపించింది. ఆఖరి టెస్టులోనూ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్‌తో తలపడనుంది.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత్‌×ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు భారీ స్థాయిలో వీక్షణలు లభించాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులకూ మునుపటి రికార్డులు బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని