INDvsENG: కోహ్లీసేనకు భయం లేదన్న సన్నీ

తాజా వార్తలు

Published : 29/06/2021 01:38 IST

INDvsENG: కోహ్లీసేనకు భయం లేదన్న సన్నీ

ఇంగ్లిష్‌ వేసవి ఇండియాకే అనుకూలం అంటున్న దిగ్గజం

ముంబయి: ఇంగ్లాండ్‌ పర్యటన గురించి టీమ్‌ఇండియా భయపడాల్సిన అవసరం లేదని దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అన్నారు. బ్రిటన్‌లో ఇప్పటికే వేసవి మొదలైందని తెలిపారు. పర్యటనలో ఆరంభ పోరులో ఓడిపోయినంత మాత్రాన ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని తెలిపారు. న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఓటమిని ఉటంకిస్తూ ఆయన మాట్లాడారు.

‘ఇంగ్లాండ్‌ సిరీసులో భారత బ్యాట్స్‌మెన్‌ భయపడాల్సిన పన్లేదు. ఎందుకంటే ఆగస్టు-సెప్టెంబర్లో అక్కడ ఎండలు ఉంటాయి. పిచ్‌లు పొడిగా ఉండి పగుళ్లు ఏర్పడతాయి. ఫస్ట్‌ స్పెల్‌లో జిమ్మీ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ వికెట్లు తీయకుంటే తర్వాతి స్పెల్స్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారు’ అని సన్నీ అన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పేసర్లు అత్యుత్తమ ఫామ్‌లో లేరు. న్యూజిలాండ్‌తో సిరీసులో వికెట్లు తీయలేక ఇబ్బంది పడ్డారు.

‘ఇంగ్లిష్‌ వేసవిని టీమ్‌ఇండియా ఓటమి (న్యూజిలాండ్‌ చేతిలో)తో ఆరంభించింది. అయితే ఓటమి భారం జ్వాలను రగిలించి పట్టుదలను పెంచితే అదృష్టం వరిస్తుంది. ప్రతిభ కలిగిన కోహ్లీసేనకు కావాల్సింది అలాంటి వైఖరే. అప్పుడు ఇంగ్లిష్‌ సమ్మర్‌ ఇండియా సమ్మర్‌ అవుతుంది’ అని గావస్కర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని