close

తాజా వార్తలు

Published : 23/01/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్‌ఇండియా

కరాచీ: గత దశాబ్దంలో క్రికెట్‌ వ్యవస్థపై భారత్‌ పెట్టిన పెట్టుబడులే ప్రస్తుతం అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నాయని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జహీర్‌ అబ్బాస్‌ అన్నాడు. ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా అద్భుత విజయానికి ఇదే కారణమని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బాగుపడాలంటే ఆటగాళ్లు, బోర్డు శక్తికిమించి శ్రమించాలని సూచించాడు.

‘టీమ్‌ఇండియా ఎలా పుంజుకుందో చూడండి. ఇప్పుడు ఆసీస్‌పై భారత్‌ విజయం సాధించింది. ఒక్కసారి కాదు. మూడేళ్లలో రెండుసార్లు విజయ దుందుభి మోగించింది. గత దశాబ్దిలో క్రికెట్‌ వ్యవస్థపై పెట్టిన పెట్టుబడులు, ప్రణాళికలే ఈ విజయానికి కారణం. ఆ కష్టానికి దక్కిన ఫలితాలే ఇవి’ అని అబ్బాస్‌ అన్నాడు.

పాకిస్థాన్‌ క్రికెట్‌ పాతాళానికి పడిపోవడాన్ని జహీర్‌ అబ్బాస్‌ విమర్శించాడు. విజయాలు దక్కాలంటే కష్టపడటం ఒక్కటే పరిష్కారమని సూచించాడు. ‘క్రికెట్లో రాణించాలంటే ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఎంతో కష్టపడాలని నేను నమ్ముతా. తన ఆటపై తాను శ్రమించకపోతే ఎంత కోచింగ్‌ ఇచ్చినా సాధించేదేమీ ఉండదు. ఎందుకంటే మా కాలంలో ప్రత్యేక కోచులు, మెంటార్లు ఉండేవారు కాదు. నెట్స్‌లో విపరీతంగా చెమటోడ్చి ఆటకు అంకితమయ్యేవాళ్లం. గొప్ప ఆటగాళ్లుగా ఎదిగాం’ అని అబ్బాస్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదు
నటరాజ్‌.. నువ్వో లెజెండ్‌: వార్నర్‌

 



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని