INDvsSL: శ్రీలంక ముందు మోస్తరు లక్ష్యం 

తాజా వార్తలు

Updated : 25/07/2021 21:54 IST

INDvsSL: శ్రీలంక ముందు మోస్తరు లక్ష్యం 

అర్ధ శతకంతో రాణించిన సూర్యకుమార్‌ యాదవ్‌

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దాంతో ఆతిథ్య జట్టు లక్ష్యం 165 పరుగులుగా నమోదైంది. సూర్యకుమార్‌ యాదవ్‌(50; 34 బంతుల్లో 5x4, 2x6), కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(46; 36 బంతుల్లో 4x4, 1x6) కీలక పరుగులు చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ధాటిగా ఆడే క్రమంలో ధావన్‌ అర్ధ శతకానికి ముందు ఔటయ్యాడు. తర్వాత సూర్యకుమార్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాక పెవిలియన్‌ చేరాడు. చివర్లో ఇషాన్‌ కిషన్‌(20 నాటౌట్‌; 14 బంతుల్లో 1x4, 1x6) కాస్త వేగంగా పరుగులు చేయడంతో భారత్‌ మోస్తరు స్కోర్‌ నమోదు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని