INDvsENG‌: తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 21/0

తాజా వార్తలు

Updated : 05/08/2021 00:37 IST

INDvsENG‌: తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 21/0

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్(9), రాహుల్‌ (9) పరుగులతో ఉన్నారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ముఖ్యంగా బుమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశారు. బుమ్రా నాలుగు, షమీ మూడు వికెట్లు తీశాడు. శార్దుల్‌ ఠాకూర్‌ రెండు, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. 

ఇక ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ జో రూట్‌(64) ఒక్కడే రాణించాడు. బెయిర్‌ స్టో(29), క్రాలే (27), సామ్‌ కరన్‌(27) భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వీరికి మిగత బ్యాట్స్‌మెన్‌ సహకరించకపోవడంతో ఇంగ్లాండ్‌ 183 పరుగులే చేసింది. తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌..రెండో సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. మూడో సెషన్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు.    

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని