20 ఓవర్లకు ఆస్ట్రేలియా 57/2
close

తాజా వార్తలు

Updated : 15/01/2021 07:06 IST

20 ఓవర్లకు ఆస్ట్రేలియా 57/2

గబ్బా: టీమ్‌ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా 20 ఓవర్లకు 57/2 స్కోర్‌ సాధించింది. క్రీజులో మార్నస్‌ లబుషేన్‌(16), స్టీవ్‌స్మిత్‌(25) ఉన్నారు. వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు తొలి ఓవర్‌లోనే టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రమాదకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(1)ను పెవిలియన్‌ పంపాడు. ఐదో బంతికి స్లిప్‌లో రోహిత్‌ చేతికి చిక్కి వార్నర్‌ ఔటయ్యాడు. తర్వాత మార్కస్‌ హారిస్‌(5) శార్దుల్‌ ఠాకుర్‌ బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన లబుషేన్‌, స్మిత్‌ నిలకడగా ఆడుతున్నారు.
ఇవీ చదవండి..
2001.. ఓడామంటే భజ్జీ వల్లే: స్టీవ్‌వా
టీమ్ఇండియా కష్టాలు నాకూ తెలుసు: పైన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని