
తాజా వార్తలు
గబ్బా టెస్టు: 100 దాటిన టీమ్ఇండియా
బ్రిస్బేన్: బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఒక వికెట్ కోల్పోయి 100 పరుగులు చేసింది. శుభ్‌మన్‌గిల్(73*), పుజారా(15*) నిలకడగా ఆడుతున్నారు. భోజన విరామ సమయానికి భారత్ 83/1తో నిలవగా తర్వాత కూడా వీరిద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 42 ఓవర్లకు టీమ్ఇండియా 100/1తో నిలిచింది. విజయానికి ఇంకా 228 పరుగుల దూరంలో ఉంది.
ఇవీ చదవండి..
స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
Tags :