మూడో టెస్టు: మ్యాచ్‌ పునఃప్రారంభం

తాజా వార్తలు

Updated : 07/01/2021 10:14 IST

మూడో టెస్టు: మ్యాచ్‌ పునఃప్రారంభం

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తిరిగి ప్రారంభమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో 21/1తో నిలిచింది. వర్షం కారణంగా ఆ సెషన్‌లో 7.1 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ప్రస్తుతం విల్‌ పకోస్కీ, లబుషేన్‌ క్రీజులో ఉన్నారు. భోజన విరామ సమయానికి సైతం వర్షం కొనసాగడంతో సుమారు నాలుగు గంటల పాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితమే వర్షం నిలిచిపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి తిరిగి మ్యాచ్‌ను ప్రారంభించారు. దీంతో 15 ఓవర్లకు ఆస్ట్రేలియా 41/1 స్కోర్‌ సాధించింది. అంతకుముందు టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నాలుగో ఓవర్‌లో డేవిడ్‌ వార్నర్‌(5)ను పెవిలియన్‌ పంపాడు. 

ఇవీ చదవండి..
జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కంటతడి..
డేవిడ్‌ వార్నర్‌ నాలుగేళ్లలో ఇలా తొలిసారి..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని