సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయి
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయి

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్ టెస్టులో తొలి రోజు సీనే రెండో రోజూ రిపీట్ అయ్యింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్‌ (218; 377 బంతుల్లో, 19×4, 2×6) సెంచరీని డబుల్ సెంచరీగా మలుచుకోగా.. సిబ్లీ (87) పాత్రని బెన్‌ స్టోక్స్‌ (82; 118 బంతుల్లో, 10×4, 3×6) పూర్తిచేశాడు. అయితే ఆఖరి సెషన్‌లో భారత బౌలర్లు పుంజుకున్నా అంతిమంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ పైచేయి సాధించింది.

263/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ శనివారం ఆట ఆఖరుకు తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోరు సాధించింది. జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం (124) నెలకొల్పారు. క్రీజులో బెస్‌ (28; 84 బంతుల్లో, 5×4), లీచ్‌ (6; 28 బంతుల్లో, 1×4) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, నదీమ్‌ ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఇంకా డిక్లేర్‌ చేయలేదు.

రెండో రోజు ఆటను ప్రారంభించిన రూట్‌, స్టోక్స్‌ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రూట్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేయగా, స్టోక్స్‌ కాస్త దూకుడుగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో స్టోక్స్‌ 73 బంతుల్లో అర్ధశతకం, రూట్‌ 260 బంతుల్లో 150 పరుగులు అందుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా తొలి సెషన్‌ను 355/3 స్కోరుతో ముగించింది. అయితే నదీమ్‌ స్టోక్స్‌ను ఔట్‌ చేయడంతో వీరిద్దరి శతక భాగస్వామ్యానికి తెరపడింది.

రూట్ డబుల్ ధమాకా

తర్వాత క్రీజులోకి వచ్చిన పోప్‌ (34; 89 బంతుల్లో, 3×4)తో కలిసి రూట్‌ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఫ్లిక్‌ షాట్లు, డ్రైవ్‌లు, స్వీప్‌షాట్లతో పరుగులు చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అతడు డబుల్ సెంచరీని సాధించడం విశేషం. తన కెరీర్‌లో ఇది అయిదో ద్విశతకం కాగా గత మూడు టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ. మరోవైపు పోప్‌ కూడా నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ టీ విరామానికి 454/4 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది.


ఆఖరి సెషన్‌ భారత్‌దే

చివరి సెషన్‌లో భారత బౌలర్లు చెలరేగారు. పోప్‌ను అశ్విన్ ఔట్ చేయగా, తర్వాతి ఓవర్‌లోనే రూట్‌ను నదీమ్ బోల్తాకొట్టించాడు. అయితే బట్లర్‌ (30; 51 బంతుల్లో, 5×4) వికెట్ల పతనానికి బ్రేక్‌లు వేశాడు. బెస్‌తో కలిసి ఏడో వికెట్‌కు 48 పరుగులు సాధించాడు. కానీ, ఇషాంత్‌ శర్మ వరుస బంతుల్లో బట్లర్‌, ఆర్చర్‌ (0)ను ఔట్ చేశాడు. భారత బౌలర్ల జోరు చూస్తే ఇంగ్లాండ్ ఆలౌట్‌ అవుతుందని భావించారంతా. కానీ బెస్‌, లీచ్ పట్టుదలతో క్రీజులో నిలిచారు.

ఇదీ చదవండి

ధోనీలాగే కోహ్లీ చేశాడు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని