చెన్నై టెస్టు: రూట్‌ 150+, స్టోక్స్‌ 60+
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 12:07 IST

చెన్నై టెస్టు: రూట్‌ 150+, స్టోక్స్‌ 60+

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌(156), బెన్‌స్టోక్స్‌(63) దూసుకుపోతున్నారు. 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 119 ఓవర్లకు 355/3 స్కోర్‌ సాధించింది. కాగా, రూట్‌కిది 100వ టెస్టు కావడం విశేషం. అయితే, ఇంతకుముందు శ్రీలంకతో ఆడిన 98, 99 టెస్టుల్లోనూ అతడు 150+ స్కోర్లు సాధించాడు. ఆ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 228, 186 పరుగులు సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు హ్యాట్రిక్‌ శతకంతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇప్పటివరకు రెండు వికెట్లు తీయగా, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. రెండో రోజు వికెట్లు తీసేందుకు టీమ్‌ఇండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని