చెన్నై టెస్టు: రెండో సెషన్‌ పూర్తి.. ఇంగ్లాండ్‌ 454/4
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 14:19 IST

చెన్నై టెస్టు: రెండో సెషన్‌ పూర్తి.. ఇంగ్లాండ్‌ 454/4

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌(209*) ద్విశతకం సాధించాడు.‌ అశ్విన్‌ వేసిన 143వ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదోసారి ఈ ఘనత సాధించాడు. అతడికి పోప్‌(24) చక్కగా సహకరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ 147 ఓవర్లకు 454/4 స్కోర్‌తో నిలిచింది. అంతకుముందు బెన్‌స్టోక్స్‌(82) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రూట్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. శనివారం 263/3 ఓవర్‌నైట్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌ భోజన విరామ సమయానికి 355/3 స్కోర్‌ సాధించింది. ఇప్పుడు భారీ స్కోర్‌ దిశగా సాగుతూ రెండో సెషన్‌లో ఒక వికెట్‌ కోల్పోయి 99 పరుగులు చేసింది.
 ఇవీ చదవండి..
ధోనీ లాగే కోహ్లీ చేశాడు.. 
ఎంతైనా మనం మనుషులం కదా: రవిశాస్త్రి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని