close
Array ( ) 1

తాజా వార్తలు

40 పరుగులకే 3 వికెట్లు

వెల్లింగ్టన్‌: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 40 పరుగులకే కీలక మూడు వికెట్లను చేజార్చుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్న పృథ్వీ షా(16: 18 బంతుల్లో ) సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన చతేశ్వర పూజారా(11) కూడా ఎక్కువ సేపు నిలువలేదు. జేమీసన్‌ బౌలింగ్‌లో వాటింగ్‌కు దొరికిపోయాడు. దీంతో భారత్‌ 35 పరుగులకే 2 కీలక వికెట్లను చేజార్చుకొని కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(2) సైతం నిరాశపరిచాడు. జేమీసన్‌ బౌలింగ్‌లోనే రాస్‌టేలర్‌కు చిక్కాడు. దీంతో భారత్‌ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పయింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(29: 67బంతుల్లో), అజింకా రహానె(19: 34 బంతుల్లో) ఉన్నారు.  
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.