రోహిత్‌శర్మ సహా.. అందరికీ కరోనా నెగెటివ్‌
close

తాజా వార్తలు

Updated : 04/01/2021 14:16 IST

రోహిత్‌శర్మ సహా.. అందరికీ కరోనా నెగెటివ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ర్టేలియా పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా సభ్యులు ఇటీవల బయోబబుల్‌ నిబంధనలు అతిక్రమించారనే వార్త దుమారం రేపిన విషయం తెలిసిందే. రోహిత్‌శర్మతో సహా ఐదుగురు క్రికెటర్లు రెస్టారెంట్‌కు వెళ్లడంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులందరికీ నిన్న కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు వచ్చినట్లు.. అందులో ఆటగాళ్లందరికీ నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. 

జట్టు సహాయ సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించామని వారికి కూడా నెగెటివ్‌గా తేలినట్లు తెలిపింది. ఈ నెల 7 నుంచి సిడ్నీలో ఆస్ర్టేలియా- భారత్‌ మధ్య మూడో టెస్టు జరగనుంది.

తొలి రెండు టెస్టులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగియడంతో.. సిరీస్‌ సజావుగా సాగుతుందోనుకుంటున్న సమయంలో బయట రెస్టారెంట్లో భోజనం చేశారని భారత ఆటగాళ్లను ఐసొలేషన్‌లో పెట్టడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిలిసిందే. 

ఇవీ చదవండి..
అంతా అయోమయం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని