చిన్నారి హృదయాలను కాపాడండి: గావస్కర్‌

తాజా వార్తలు

Published : 11/07/2021 10:35 IST

చిన్నారి హృదయాలను కాపాడండి: గావస్కర్‌

దిల్లీ: మైదానంలో పరుగుల వరద పారించి దిగ్గజంగా ఎదిగిన సునీల్‌ గావస్కర్‌.. తన రెండో ఇన్నింగ్స్‌లో ఎంతో మంది చిన్నారులకు ప్రాణదానం చేస్తూ మహోన్నత వ్యక్తిగా మారాడు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు తన ‘‘హార్ట్‌ టూ హార్ట్‌’’ ఫౌండేషన్‌ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తూ.. పసి హృదయాలకు రక్షగా నిలుస్తున్నాడు. శనివారం తన 72వ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఇలాంటి సమస్యలున్న పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రితో కలిసి ఈ ఫౌండేషన్‌ గత కొన్నేళ్లలో 16 వేల మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు జరిగేలా చూసింది. వాటిలో 99 శాతం శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి.

‘‘ఈ చిన్నారుల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో మరింత మంది భాగం కావాలనేదే నా పుట్టినరోజు కోరిక. మరింత సమాచారం కోసం వాళ్లు నేరుగా అంతర్జాలంలో శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రులను సంప్రదించవచ్చు. గుండె జబ్బులతో పుట్టే చిన్నారుల సమస్య గురించి అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్లకు చికిత్స అందించేందుకు విరాళాల సేకరణ కోసం కొన్నేళ్ల కిత్రం ఈ ఫౌండేషన్‌ స్థాపించా’’ అని సన్నీ చెప్పాడు. మన దేశంలో మూడు లక్షలకు పైగా చిన్నారులు గుండె జబ్బులతో పుట్టారని, వాళ్లలో మూడో వంతు పసివాళ్లు తమ తర్వాతి పుట్టినరోజు చూడకుండానే చనిపోతున్నారని గావస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని