
తాజా వార్తలు
‘లైవ్’లో మ్యాచ్ ఫిక్సయింది!
సిడ్నీ(ఆస్ట్రేలియా): భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న సిడ్నీ మైదానం ఓ జంటను ఏకం చేసిన వేదికైంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ బ్యాట్స్మెన్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారత యువకుడు ఆస్ట్రేలియా యువతికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని ఉంగరం చూపిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన యువతి.. మొత్తానికి ఆ యువకుడి ప్రేమకు పచ్చజెండా ఊపింది.
అయితే ఇదంతా.. కెమెరాకు చిక్కి స్టేడియంలో ఉన్న పెద్ద స్రీన్లపై ప్రత్యక్ష ప్రసారమైంది. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్వెల్ సైతం చప్పట్లు కొడుతూ.. వాళ్లను అభినందించాడు. మ్యాక్స్వైల్ భార్య కూడా భారతీయ యువతి కావడం గమనార్హం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
