WTC Final: టీమ్‌ఇండియా ఖరారు.. 
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: టీమ్‌ఇండియా ఖరారు.. 

24 మందితో జాబితా విడుదల..

ఇంటర్నెట్‌డెస్క్‌: సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. కాసేపటి క్రితమే బీసీసీఐ 24 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందరూ ఊహించినట్లే ఇటీవల ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఆడినవారే ఉన్నారు. కొత్తగా నలుగురు యువకులను స్టాండ్‌ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. కాగా, టీమ్‌ఇండియా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 2-1 తేడాతో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకోగా, ఆపై స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సంపాదించి.. రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో తలపడనుంది. మరోవైపు ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌కు సైతం ఇదే టీమ్‌ఇండియాను ప్రకటించడం గమనార్హం.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకుర్‌, ఉమేశ్‌ యాదవ్‌.

కేఎల్ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా ఫిట్‌నెస్‌ పరీక్షలు నెగ్గితే ఇంగ్లాండ్‌కు పయనమవుతారు. ఇక కొత్తగా నలుగురు యువ క్రికెటర్లను స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. వారిలో అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జున్‌ నాగ్‌వస్వల్లా ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని