ద్రవిడ్‌ నుంచి ఆణిముత్యాలను చూస్తున్నాం

తాజా వార్తలు

Published : 30/01/2021 10:00 IST

ద్రవిడ్‌ నుంచి ఆణిముత్యాలను చూస్తున్నాం

ఇంటర్నెట్‌డెస్క్‌: రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉంటే యువ క్రికెటర్లు తప్పులు చేసినా ఆగ్రహం వ్యక్తం చేయడని.. వారికి అర్థమయ్యేలా వివరిస్తాడని టీమ్‌ఇండియా మాజీ మానసిక వైద్య నిపుణులు పాడీ ఆప్టన్‌ అన్నారు. ద్రవిడ్‌ లాంటి కోచ్ ఉండటం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఆటగాళ్ల చుట్టూ ఉండే పరిస్థితులు వారిపై పెను ప్రభావం చూపుతాయన్నారు. తాజాగా ఆప్టన్‌ మాట్లాడుతూ ద్రవిడ్‌ గొప్పతనం గురించి వివరించారు.

‘ఆటగాళ్లు తప్పులు చేస్తే ద్రవిడ్‌ కోపగించుకోడు. వారికి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. దాంతో ఆటగాళ్లను మానసికంగా ఒత్తిడికి దూరం చేస్తాడు. వాళ్లతో మాట్లాడి మంచి ప్రదర్శన చేసేలా ప్రోత్సహిస్తాడు. గబ్బా టెస్టులో మనం అదే చూశాం.  కఠిన పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. వారి విజయంలో ద్రవిడ్‌ పాత్ర కచ్చితంగా ఉందని అనుకుంటా’ అని ఆప్టన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ద్రవిడ్‌ 2016 నుంచి 2019 వరకు అండర్‌-19, ఇండియా ఎ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతడి నేతృత్వంలోనే రిషభ్‌పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైని, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శుభ్‌మన్‌గిల్‌ లాంటి యువకులు మెరుగయ్యారు.

ఇవీ చదవండి..
పంతా?.. సాహానా?
కోహ్లీని ఔట్ చేసే వ్యూహమదే: ఇంగ్లాండ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని