Tokyo Olympics: క్వార్టర్‌ ఫైనల్లోకి మహిళల హాకీ జట్టు

తాజా వార్తలు

Updated : 31/07/2021 19:34 IST

Tokyo Olympics: క్వార్టర్‌ ఫైనల్లోకి మహిళల హాకీ జట్టు

టోక్యో: భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్‌ జట్టు ఐర్లాండ్‌ను 2-0 గోల్స్‌ తేడాతో ఓడించడంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆడే అవకాశం దక్కినట్లైంది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌కు చేరుకుంది. ఒలింపిక్స్‌ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై.. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి క్వార్టర్‌ ఫైనల్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆరు పాయింట్లతో గ్రూప్‌-ఏలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, గ్రూప్‌-ఏలో చివరి మ్యాచ్‌.. ఐర్లాండ్‌, బ్రిటన్‌ మధ్య జరిగే పోటీలో బ్రిటన్‌ గెలుపోటములపై భారత మహిళల జట్టు భవితవ్యం ఆధారపడినట్లయింది. ఐర్లాండ్‌పై బ్రిటన్‌ విజయం సాధించడంతో భారత్‌ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా భారత్‌ ఈ దశకు చేరుకునేది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని