INDvsENG: వరుణుడి దోబూచులాట.. మళ్లీ నిలిచిపోయిన ఆట

తాజా వార్తలు

Published : 05/08/2021 21:52 IST

INDvsENG: వరుణుడి దోబూచులాట.. మళ్లీ నిలిచిపోయిన ఆట

నాటింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా మూడోసారి ఆటకు అంతరాయం కలిగింది. రెండో సెషన్‌లో టీమ్‌ఇండియా 46.1 ఓవర్ల వద్ద 125/4 స్కోరుతో కొనసాగుతున్న వేళ వెలుతురు లేమి కారణంగా అంపైర్లు తొలిసారి ఆటను నిలిపివేశారు. కాసేపటికే వర్షం కురవడంతో ఆట మరింత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా రెండో రోజు తేనీరు విరామం కూడా తీసుకుంది. అయితే, తర్వాత వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో అంపైర్లు ఆటను కొనసాగించారు. కానీ, అండర్సన్‌ ఒక బంతి వేయగానే మళ్లీ వర్షం కురిసింది. దాంతో రెండోసారి ఆపేశారు. కాసేపటికే వర్షం నిలిచిపోవడంతో ఆటను కొనసాగించారు. ఆపై అండర్సన్‌ మరో రెండు బంతులు వేయగానే వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. దాంతో మూడోసారి ఆగిపోయింది. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌(57), రిషభ్‌ పంత్‌(7) నాటౌట్‌గా నిలిచారు. టీమ్‌ఇండియా ఇంకా 58 పరుగుల వెనుకంజలో నిలిచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని