CSK Vs KKR: ఉత్కంఠ పోరులో చెన్నైదే విజయం

తాజా వార్తలు

Updated : 26/09/2021 19:45 IST

CSK Vs KKR: ఉత్కంఠ పోరులో చెన్నైదే విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఐపీఎల్‌ సీజన్‌-14 రెండో దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి జోరు మీదున్న సీఎస్కే.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగరేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (40; 28 బంతుల్లో 2×4, 3×6), డుప్లెసిస్‌ (43; 30 బంతుల్లో 7×4) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, చివరి ఓవర్‌ చివరి బంతి వరకు మ్యాచ్‌ సాగడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో నాలుగు పరుగులు అవసరం అవ్వగా.. రెండు వికెట్లు పడడంతో చివరి బంతి వరకు మ్యాచ్‌ సాగింది. దీపక్‌ చాహర్‌ చివర్లో ఒక పరుగు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన డుప్లెసిస్‌.. తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లోనూ ఇదే సీన్‌ రిపీట్ చేశాడు. సునీల్‌ నరైన్‌ వేసిన ఐదో ఓవర్‌లో గైక్వాడ్‌ ఓ సిక్స్‌, ఫోర్‌ బాదాడు. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌ని రసెల్ 9వ ఓవర్లో వెనక్కి పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (35; 28బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 11.3 ఓవర్‌కు డుప్లెసిస్‌ ఔటయ్యాడు. అంబటి రాయుడు (10)ని సునీల్ నరైన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఫెర్గూసన్‌ వేసిన 17వ ఓవర్‌లో మొయిన్‌ అలీ వెంకటేశ్ అయ్యర్‌కి చిక్కాడు. రైనా (11), ధోనీ (1) ఔటవడంతో చివర్లో ఉత్కంఠ నెలకొంది. జడేజా (22; 8బంతుల్లో 2×4, 2×6) చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో చెన్నైకి నాలుగు పరుగులు అవసరం అవ్వగా.. సామ్‌ కరణ్‌, జడేజా అదే ఓవర్‌లో ఔటయ్యారు. దీంతో దీపక్‌ చాహర్‌ ఒక్క పరుగు తీయడంతో చెన్నై విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌ మూడు, రసెల్, ఫెర్గూసన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, చక్రవర్తి తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (45; 33 బంతుల్లో బంతుల్లో 4×4, 1×6), నితీశ్ రాణా (37; 27 బంతుల్లో  3×4, 1×6) రాణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని