IPL 2021:ఒక్క మ్యాచ్‌ ఆడితే చాలు.. కోహ్లీ మరో రికార్డు

తాజా వార్తలు

Published : 20/09/2021 18:01 IST

IPL 2021:ఒక్క మ్యాచ్‌ ఆడితే చాలు.. కోహ్లీ మరో రికార్డు

((Photo: Virat Kohli Twitter)

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ లేని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ని ఊహించుకోలేము. ఐపీఎల్ ఆరంభ సీజన్‌(2008) నుంచి ఆర్‌సీబీ తరపునే ఆడుతున్న కోహ్లీ ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ స్టార్‌ ఆటగాడు ఐపీఎల్ ఇప్పటివరకు ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు (6076) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇందులో  5 శతకాలు, 40 అర్ధశతకాలున్నాయి. అయితే, సోమవారం అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) జరిగే మ్యాచ్‌లో విరాట్‌ ఆడితే.. మరో మైలురాయిని అందుకోనున్నాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు. కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడితే ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్‌లు ఆటగాడిగా నిలుస్తాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్‌లు ఆడలేదు.అయితే, ఓవరాల్‌గా చూసుకుంటే ఆర్‌సీబీ తరఫున విరాట్‌కి ఇది 215 మ్యాచ్‌. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో ఆర్‌సీబీ తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు.

మరోవైపు, ఈ ఐపీఎల్ సీజన్‌ తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు కెప్టెన్‌గా తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్‌సీబీకే ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశాడు.ఆటగాడిగా విజయవంతమైన కోహ్లీ.. కెప్టెన్‌గా ఆర్‌సీబీని ఇంతవరకు ఛాంపియన్‌గా నిలపలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2016లో ఫైనల్‌ చేరడమే బెంగళూరుకు అత్యుత్తమ ప్రదర్శన. ఈ సారి అయినా  ఆర్‌సీబీని విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు

ఆటగాడు           మ్యాచ్‌లు     ప్రస్తుతం ఆడుతున్న జట్టు

ఎం.ఎస్‌.ధోనీ          212          చెన్నై సూపర్‌ కింగ్స్‌ 

రోహిత్ శర్మ           207         ముంబయి ఇండియన్స్‌

దినేశ్‌ కార్తీక్‌           203           కోల్‌కతా నైట్‌రైడర్స్‌

సురేశ్‌ రైనా            201           చెన్నై సూపర్‌ కింగ్స్‌ 

విరాట్‌ కోహ్లీ           199          రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని