IPL 2021:‘అప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి’ 

తాజా వార్తలు

Published : 07/10/2021 01:16 IST

IPL 2021:‘అప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి’ 

(Photo: SunRisers Hyderabad Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ తరఫున జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌బైలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.  ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌ 151.03 కి.మీ. వేగంతో బంతి విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. 21 ఏళ్ల ఈ క్రికెటర్‌ సాధారణ కుటుంబం నుంచి ఈ స్థితికి వచ్చాడు. ఇతని తండ్రి కూరగాయలు, పండ్ల వ్యాపారి. తన కుమారుడు ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని ఉమ్రాన్‌ తండ్రి అబ్దుల్ మాలిక్‌ పేర్కొన్నాడు.

‘నా కుమారుడికి చిన్ననాటినుంచే క్రికెట్ అంటే ఆసక్తి. ప్రొఫెషనల్ క్రికెటర్‌ కావాలని కలలు కనేవాడు. సన్‌రైజర్స్‌ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేయడంతో చాలా సంతోషించాము. మ్యాచ్‌ జరుగుతున్నసేపు టీవీకి అతుక్కుపోయాము. నాకు, నా భార్యకు  ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇది మమూలు విషయం కాదు. మాది చాలా పేద కుటుంబం. నేను పండ్లు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నా కుమారుడు నన్ను గర్వపడేలా చేశాడు. మా ఆనందానికి అవధులు లేవు. ఉమ్రాన్‌ని లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కూడా అభినందించాడు. ఏదో ఒకరోజు అతడు టీమ్‌ఇండియాకు ఆడతాడనే నమ్మకం ఉంది’ అని అబ్దుల్ మాలిక్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని