IPL 2021:వారెవ్వా.. అచ్చం ధోనీలా హెలికాప్టర్‌ షాట్‌.. కొట్టింది ఎవరంటే?

తాజా వార్తలు

Published : 08/09/2021 15:12 IST

IPL 2021:వారెవ్వా.. అచ్చం ధోనీలా హెలికాప్టర్‌ షాట్‌.. కొట్టింది ఎవరంటే?

(Photo:Mumbai Indians Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌ పున: ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఈ మెగా టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే చాలా జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్‌లో తలమునకలవుతున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌ కూడా సాధన మొదలెట్టింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు హార్దిక్‌ పాండ్య ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించాలనే పట్టుదలతో ఉన్న హార్దిక్‌.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

అయితే, ఐపీఎల్‌ అయినా, అంతర్జాతీయ క్రికెట్‌ అయినా హెలికాప్టర్‌ షాట్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చేది  టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. ఈ షాట్‌ని ఆడేందుకు చాలా ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నా..కొంతమంది మాత్రమే సఫలీకృతులవుతున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్‌ ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్‌ పాండ్య.. అచ్చం ధోనీలా హెలికాప్టర్‌ షాట్‌ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ముంబయి ఇండియన్స్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

మరోవైపు, ఒకట్రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ.. భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఇందులో తనకు చోటు దక్కుతుందని హార్దిక్‌ పాండ్య ఆశాభావంతో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన శార్దూల్‌ ఠాకూర్‌ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని