ఆ విషయం ధావన్‌ చెప్పేదాకా తెలీదు: పృథ్వీ షా

తాజా వార్తలు

Published : 28/05/2021 01:44 IST

ఆ విషయం ధావన్‌ చెప్పేదాకా తెలీదు: పృథ్వీ షా

(photo:Prithvi Shaw Twitter)

ఇంటర్నెట్ డెస్క్: ఒక బ్యాట్స్‌మన్‌ ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టడం ఏ ఫార్మాట్‌ క్రికెట్‌లోనైనా చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్‌లోనూ ఈ రికార్డు రెండుసార్లు మాత్రమే నమోదయింది. 2012లో రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు అజింక్యా రహానే ఈ ఘనత సాధించాడు. 2021 ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే దిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అయితే, ఐదు ఫోర్లు కొట్టిన తర్వాత ఓవర్‌ అయిపోయిందని పృథ్వీ షా భావించాడట. ఎందుకంటే ఈ ఓవర్‌లో మొదటి బంతి వైడ్‌. ఈ విషయాన్ని మరచిపోయిన పృథ్వీ షా ఓవర్‌ అయిపోయిందనుకున్నాడు. కానీ నాన్‌ స్ట్రైక్‌ఎండ్‌లో ఉన్న మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. ఇంకో బంతి మిగిలి ఉన్న విషయాన్ని షాకు గుర్తు చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీ షానే వెల్లడించాడు.

‘ఐదో బంతిని బౌండరీకి పంపిన కొద్దిసేపటి తర్వాత ఆరో బంతి ఉందని నాకు తెలిసింది. మొదటి బంతిని మావి వైడ్‌ వేసిన విషయాన్ని మరచిపోయా. దాంతో ఓవర్‌ అయిపోయిందని రిలాక్స్‌ అయ్యా. అప్పుడు శిఖర్ ధావన్‌ నా దగ్గరికి వచ్చి ఇంకో బంతి ఉందని గుర్తుచేశాడు. ఆరు ఫోర్లు కొట్టే వరకూ రికార్డు గురించి ఆలోచించలేదు’ అని షా వివరించాడు.

బయోబుడగలోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని