ఐపీఎల్‌: బాహుబలి దిగాడు.. సీఎస్కేతో మధురం..
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌: బాహుబలి దిగాడు.. సీఎస్కేతో మధురం..

* సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ చెన్నై చేరుకున్నాడు. అతడితో పాటు కేన్‌ విలియమ్సన్‌, బ్రాడ్‌ హడిన్‌ సైతం వచ్చారు. భువీ సైతం వారితో కలవడంతో హైదరాబాద్‌ శిబిరంలో సందడి పెరిగింది.

* మోర్గాన్‌ ఎక్కడ? మోర్గాన్‌  ఆడతాడా? మోర్గాన్‌ ఫిట్‌గా ఉన్నాడా? ఇలాంటి సందేహాలే వద్దంటోంది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. మోర్గాన్‌ నెట్స్‌లో సాధన చేస్తున్న వీడియోను పంచుకుంది.

* అందరం 2011 ప్రపంచకప్‌ హైలైట్స్‌ చూస్తున్నామంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం జట్టులో ఉన్న కుర్రాళ్లు అప్పుడెలా ఫీలయ్యారో ఓ వీడియో పెట్టింది.

* భారతదేశంలో అడుగుపెట్టిన పంజాబ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీరోడ్స్‌ ఈ నేలకు వందనం చేశాడు. యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌, అర్షదీప్‌సింగ్‌, క్రిస్‌జోర్డాన్‌ విపరీతంగా సాధన చేస్తున్నారు.

* కివీస్‌ కుర్రాళ్లు, సఫారీ ఆటగాళ్లు వచ్చేశారని ముంబయి ఇండియన్స్‌ సంబరపడింది. కొవిడ్‌ నిబంధనలపై అందరికీ అవగాహన కల్పించింది.

* చెన్నైతో పోరాటాలు ఎప్పటికీ మధుర స్మృతులే..! ఒకప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకొంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. వాషింగ్టన్‌ సుందర్‌ కేవలం టీ20 క్రికెటరే  కాదంటూ ఓ వీడియో పెట్టింది.

* ఐదు నెలల తర్వాత బెన్‌స్టోక్స్‌ను రాయల్‌గా మార్చేశామంటోంది రాజస్థాన్‌. కుర్రాళ్లు క్వారంటైన్‌లో ఎలా గడుపుతున్నారో వీడియో పెట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచంటే కాలుమీద కాలువేసుకోవాల్సిందే అంటున్నాడు రాహుల్‌ తెవాతియా!
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని