IPL 2021: ఐపీఎల్‌ ప్రసారాలపై అఫ్గాన్‌లో నిషేధం.. కారణం ఏంటంటే..

తాజా వార్తలు

Published : 21/09/2021 01:28 IST

IPL 2021: ఐపీఎల్‌ ప్రసారాలపై అఫ్గాన్‌లో నిషేధం.. కారణం ఏంటంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ రెండో దశ ఉత్సాహంగా ప్రారంభమైంది. యూఏఈ వేదికగా ముంబయి, చెన్నై మధ్య మ్యాచ్‌తో రెండో దశ టోర్నీ మొదలైంది. అయితే ఈ ఏడాది ఈ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్‌లోని క్రికెట్‌ అభిమానులు వీక్షించలేకపోతున్నారు. ఇటీవల దేశాన్ని హస్తగతం చేసుకుని అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధించారు. ‘మతభావాలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌’ కారణంగా ఈ ప్రసారాలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. 

‘‘ఐపీఎల్‌ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్‌లో ప్రసారం చేయడం లేదు. ఇందులో కంటెంట్‌, మహిళల డ్యాన్స్‌లు.. తదితర కారణాల దృష్ట్యా ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్ తాలిబన్‌ ఈ టోర్నీ ప్రసారాలపై నిషేధం విధించింది’’ అని అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ మీడియా మేనేజర్‌, జర్నలిస్టు ఇబ్రహిం మహ్మద్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అనేక వినోదాత్మక కార్యక్రమాలపై ఆంక్షలు వచ్చిన విషయం తెలిసిందే. అటు మహిళలు ఆటల్లో పాల్గొనడంపైనా నిషేధం విధించారు. పురుషులు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చిన తాలిబన్లు.. తాజాగా ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధించడం గమనార్హం. 

అఫ్గానిస్థాన్‌ స్టార్‌ ఆటగాళ్లు రషీద్‌ఖాన్‌, నబీతో పాటు పలువురు అఫ్గాన్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని