CSK vs RR: బుధవారం మ్యాచు వాయిదాయేనా?

తాజా వార్తలు

Published : 04/05/2021 11:11 IST

CSK vs RR: బుధవారం మ్యాచు వాయిదాయేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ వారం రోజుల్లో ఎన్ని మ్యాచులు జరుగుతాయో.. ఎన్ని వాయిదా పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బుధవారం జరిగే రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచుపై నీలి మబ్బులు కమ్ముకున్నాయి. బహుశా ఈ పోరు రీషెడ్యూలు అవుతుందని సమాచారం.

ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ దిల్లీలో ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి వైరస్‌ సోకిందని సోమవారం తెలిసింది. అంతకు ముందు జరిగిన మ్యాచులో అతడు సీఎస్‌కే డగౌట్‌లో కూర్చుకున్నాడు. అంతేకాకుండా ఆటగాళ్లతో మాట్లాడాడు. వారిని కలిశాడు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టంతా వారం రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉండనుంది. ఎవ్వరినీ కలిసేందుకు వీల్లేదు. అలాగే ప్రతిరోజూ ఆటగాళ్లకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు.

ఈ వారంలో చెన్నై మూడు మ్యాచులు ఆడనుంది. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌, శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. మరి వారం రోజుల క్వారంటైన్‌ అంటే ఈ మూడూ ఆడే పరిస్థితి లేనట్టే. దిల్లీ వేదికగా జరిగే రాజస్థాన్‌, హైదరాబాద్‌ మ్యాచులైతే జరగవనే అంటున్నారు! ఇక ఆదివారం జరిగే మ్యాచుకు వేదిక బెంగళూరు. ప్రస్తుతం దానిని ముంబయికి మారుస్తున్నారు. అలాగైనా సరే.. అప్పట్లోగా ధోనీసేన క్వారంటైన్‌ ముగిసే అవకాశమైతే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం ఐపీఎల్‌ మ్యాచుల నిర్వహణ కష్టమేనన్నది ఆయా వర్గాల అభిప్రాయం!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని