బ్లూ జెర్సీ ధరించి భారత జెండాను చూశాక..: ఇషాన్‌ కిషన్‌

తాజా వార్తలు

Updated : 15/03/2021 12:19 IST

బ్లూ జెర్సీ ధరించి భారత జెండాను చూశాక..: ఇషాన్‌ కిషన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగినప్పుడు ఆందోళనకు గురయ్యానని చెప్పాడు. అయితే, టీమ్ఇండియా జెర్సీ ధరించి, జాతీయ జెండాను చూస్తే అత్యుత్తమ ప్రదర్శన చేయాలనిపించిందని అన్నాడు. గతరాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఇషాన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6) ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (73; 49 బంతుల్లో 5x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు. దాంతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి అభిమానుల మన్ననలు పొందాడు.

మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్‌.. తన బ్యాటింగ్‌పై స్పందించాడు. తాను ఇక్కడిదాకా రావడానికి ఎంతో మంది కృషి చేశారని చెప్పాడు. అలాగే ముంబయి ఇండియన్స్‌ సారథి, టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తనకు అండగా నిలిచాడన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్‌ తనతో మాట్లాడాడని తెలిపాడు. ‘రోహిత్‌ భాయ్‌ నా వద్దకు వచ్చి నేను ఈరోజు ఓపెనింగ్‌ చేస్తున్నానని చెప్పాడు. అలాగే ఎలాంటి ఆందోళనా లేకుండా ఐపీఎల్‌లో ఆడినట్లే ఇక్కడా ప్రశాంతంగా ఆడమన్నాడు. కానీ, బరిలోకి దిగినప్పుడు నేను ఆందోళనకు గురయ్యా. చివరికి టీమ్‌ఇండియా జెర్సీ ధరించి భారత జెండాను చూశాక.. ఏదేమైనా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అనుకున్నా’ అని కిషన్‌ వివరించాడు.

ఇక తర్వాత అర్ధ శతకం పూర్తిచేసిన విషయం తనకు తెలియదని, కోహ్లీ అభినందించినప్పుడే తెలిసిందని అన్నాడు. ‘విరాట్‌ భాయ్‌ టాప్ ఇన్నింగ్స్‌ అని ప్రశంసించాడు. అప్పుడే నేను అర్ధశతకం సాధించానని అర్థమైంది. కానీ, సహజంగా నేను 50 పరుగులు చేసినప్పుడు బ్యాట్‌ పైకెత్తను. కోహ్లీ గట్టిగా అరుస్తూ మైదానం నలువైపులా బ్యాటెత్తి చూపమని అన్నాడు. ఇది నీ తొలి మ్యాచ్‌ అందరికీ బ్యాట్‌ చూపించు అని అన్నాడు. అప్పుడే నేను బ్యాట్‌ పైకెత్తాను. అది నాకు ఆజ్ఞాపించినట్లు అనిపించింది’ అని ఇషాన్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని