ప్రసిధ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి

తాజా వార్తలు

Published : 21/03/2021 02:00 IST

ప్రసిధ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే జట్టుకు ఎంపికైన యువపేసర్‌ ప్రసిధ్‌ కృష్ణకు సెలక్టర్లు నిలకడగా అవకాశాలు ఇవ్వాలని మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ సూచించారు. అతడు టీమ్‌ఇండియాకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో ఆరడుగుల ఎత్తున్న పేసర్లు తక్కువగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

‘నిజానికి ప్రసిధ్‌కృష్ణ బౌలింగ్‌ను నేను ఎక్కువగా చూడలేదు. అతడి నైపుణ్యాల గురించి మాత్రం విన్నా. అతడు పొడగరి కావడం అదృష్టం. అదనపు వేగం, బౌన్స్‌ రావాలంటే పొడవు అత్యంత కీలకం. ప్రస్తుత టీమ్‌ఇండియా బౌలింగ్ లైనప్‌లో ఇషాంత్‌, సిరాజ్‌ మినహా మరెవరూ ఆరు అడుగులు లేరు. ప్రసిధ్‌ కృష్ణ పొడవు 6 అడగుల 2 అంగుళాలు. అతడి బౌలింగ్‌ శైలి సైతం బాగుంటుంది. షమి, సిరాజ్‌, ఉమేశ్‌ తరహాలో అతడు వేగంగా క్రీజులోకి పరుగెత్తడు. అతడివి పొడవు చేతులు కాబట్టి రనప్‌ ఆఖర్లో వేగం సృష్టించాడు. గాయాల కారణంగా ప్రసిధ్‌ కర్ణాటక జట్టులోకి వస్తూ వెళ్లాడు. కానీ మూడేళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు’ అని వెంకటేశ్‌ ప్రసాద్ అన్నారు.

‘దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న వేర్వేరు బౌలర్లను పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. వన్డే, టీ20ల్లో వారిని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రసిధ్‌కు అవకాశమిచ్చారు. అయితే అతడికి నిలకడగా అవకాశాలు ఇవ్వడం అవసరం. ఫాస్ట్‌ బౌలర్ల రిజర్వు బెంచ్‌ను మరింత పటిష్ఠం చేయాలని సెలక్టర్లు అనుకుంటున్నారు. అప్పుడే 8-10 మంది ఫాస్ట్‌ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉండగలరు’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు. ప్రసిధ్‌ తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఆడి 34 వికెట్లు తీశాడు. 48 లిస్ట్‌-ఏ మ్యాచుల్లో 81 వికెట్లు పడగొట్టాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని