INDvsENG: ఈ సిరీస్‌తో మేమేంటో తెలుస్తుంది: లీచ్‌ 

తాజా వార్తలు

Published : 02/08/2021 01:18 IST

INDvsENG: ఈ సిరీస్‌తో మేమేంటో తెలుస్తుంది: లీచ్‌ 

మరో మూడు రోజుల్లో ఐదు టెస్టుల సిరీస్‌..

లండన్‌: మరో మూడు రోజుల్లో టీమ్‌ఇండియాతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌తో తాము ఏ స్థాయిలో ప్రదర్శన చేస్తున్నామో తెలుస్తుందని ఇంగ్లాండ్‌ ఆటగాడు జాక్‌లీచ్‌ అన్నాడు. గత ఫిబ్రవరి, మార్చిలో భారత్‌లో ఆడిన టెస్టు సిరీస్‌ సందర్భంగా లీచ్‌ 18 వికెట్లు తీసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ సిరీస్‌ నుంచి స్ఫూర్తిపొంది రాబోయే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ తాను మరింత మెరుగైన ప్రదర్శన చేస్తానని నమ్మకంతో చెప్పాడు.

‘ఇంగ్లాండ్‌లో వికెట్లు బాగుంటే నైపుణ్యాలను కాస్త మెరుగుపర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్పిన్‌ బౌలింగ్‌ చేయడమంటే నాకెంతో ఇష్టం. అయితే, ఇక్కడి పిచ్‌లు సహజంగానే డ్రైగా ఉండటంతో కచ్చితంగా నాకు ఆడే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. ఈ క్రమంలోనే టీమ్ఇండియా లాంటి బలమైన జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడితే.. అప్పుడు మేము ఏ స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇప్పుడు భారత జట్టుపై మంచి ప్రదర్శన చేసి మా జట్టులో స్థిరమైన ఆటగాడిగా కొనసాగాలనుకుంటున్నా’ అని లీచ్‌ వివరించాడు.

తాను ఈ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ప్రస్తుతం తన దృష్టంతా టీమ్‌ఇండియాపైనే ఉందని ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బాగా ఆడకపోతే తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు దూరమౌతానని సందేహం వెలిబుచ్చాడు. ప్రస్తుతం తనముందున్న దాని గురించే ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటన అంటే తనకెంతో ఆసక్తి అని, కానీ ఇప్పుడు టీమ్‌ఇండియా సిరీస్‌ గురించే ఆలోచిస్తున్నానని అన్నాడు. ఇక చివరగా బెన్‌స్టోక్స్‌ క్రీడల నుంచి నిరవధిక విశ్రాంతి తీసుకోవడంపై స్పందిస్తూ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పాడు. అయితే, స్టోక్స్‌ త్వరలోనే జట్టులోకి రావాలని ఆశిస్తున్నట్లు కూడా లీచ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, స్టోక్స్‌ కొద్దిరోజుల క్రితమే మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు కొద్దికాలం క్రికెట్‌కు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని