ICC Rankings: రవీంద్ర జడేజా @ No.1
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 19:25 IST

ICC Rankings: రవీంద్ర జడేజా @ No.1

దుబాయ్‌: టీమ్‌ఇండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌గా ఆవిర్భవించాడు. టెస్టులకు సంబంధించి ఐసీసీ తాజాగా విడుదల చేసిన టాప్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. రెండు రేటింగ్‌ పాయింట్ల ఆధిక్యంతో జేసన్‌ హోల్డర్‌ (384)ను రెండో స్థానంలోకి నెట్టేశాడు. బెన్‌స్టోక్స్‌ (377), రవిచంద్రన్‌ అశ్విన్‌ (353), షకిబ్‌ అల్‌ హసన్‌ (338).. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచారు.

ఆల్‌రౌండర్ల విభాగంలోనే కాకుండా బౌలర్ల జాబితాలోనూ అశ్విన్‌ టాప్-5లో ఉన్నాడు. 850 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్యాట్‌ కమిన్స్‌ (908) అగ్రస్థానంలో ఉండగా, టిమ్‌ సౌథీ (830) మూడో ర్యాంకులో నిలిచాడు.

ఇక బ్యాట్స్‌మన్‌ జాబితాలో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ (814) నాలుగో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ (891), కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (886), మార్నస్ లబుషేన్‌ (878) వరుసగా 1, 2, 3 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ (797) ఐదో స్థానంలో ఉండగా రిషభ్ పంత్‌, రోహిత్‌ శర్మ 747 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని