బుమ్రా బౌలింగే కాదు.. స్టెప్పులూ వేయగలడు

తాజా వార్తలు

Updated : 16/03/2021 13:39 IST

బుమ్రా బౌలింగే కాదు.. స్టెప్పులూ వేయగలడు

సంజనతో ఆడి పాడిన టీమ్‌ఇండియా పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా మైదానంలో నిప్పులు చెరిగే బంతులేయడం, పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపడం మనం ఇన్నాళ్లూ చూశాం. కానీ, అతడికి డ్యాన్స్ చేయడం, పాటకు తగ్గట్లు స్టెప్పులేయడం కూడా వచ్చనే విషయం తాజాగా తెలిసింది. క్రీడాఛానల్‌ వ్యాఖ్యాత సంజన గణేశన్‌ను సోమవారం బుమ్రా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంతకుముందు నిర్వహించిన సంగీత్‌ కార్యక్రమంలో తన ప్రియసఖితో కలిసి ఆడిపాడాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు బుమ్రా వ్యక్తిగత కారణాలతో టీమ్‌ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఈ విషయంపై ఎన్ని వార్తలొచ్చినా టీమ్‌ఇండియా పేసర్‌ మౌనంగానే ఉన్నాడు. తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు. చివరికి సోమవారం సంజనతో ఒక్కటైన ఫొటోలను స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. మీరూ వాటిని చూసి ఆస్వాదించండి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని