
తాజా వార్తలు
గోవాలో బుమ్రా వివాహం..!
(Photo:Sanjana Ganesan Twitter)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్బుమ్రా ఈనెల 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, బుమ్రాకు కాబోయే భార్య ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్ను బుమ్రా జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడని తాజా సమాచారం.
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టుకు ముందు బుమ్రా అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ నుంచి సెలవులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడికి వివాహం కుదిరిందనే వార్తలు ప్రసారమయ్యాయి. దానికి తోడు దక్షిణాది సినీ తార అనుపమ పరమేశ్వరన్తో వివాహం జరగబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని అనుపమ కుటుంబసభ్యులు కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి బుమ్రా పెళ్లి వార్త ఆసక్తి రేపింది. ఒకవేళ ఇదే నిజమైతే టీమ్ఇండియా పేసర్ ఇక ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరమైనట్లే. ఆపై నేరుగా ఐపీఎల్ 2021 సీజన్ ఆడే అవకాశం ఉంది.