100వ టెస్టులో రూట్ @100

తాజా వార్తలు

Published : 05/02/2021 16:07 IST

100వ టెస్టులో రూట్ @100

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ (101*) శతకం సాధించాడు. తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న రూట్ సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ మూడంకెల స్కోరును అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడికిది 20వ శతకం. మరోవైపు ఓపెనర్ సిబ్లీ (83*) కూడా సెంచరీ దిశగా వెళ్తున్నాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 164* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం 79 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 228/2. భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్లు దక్కట్లేదు. ఇంకా తొలి రోజు ఆటలో 11 ఓవర్లు మిగిలున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని