Rajasthan Royals: బట్లర్‌ శతక్కొట్టుడు..

తాజా వార్తలు

Updated : 02/05/2021 17:32 IST

Rajasthan Royals: బట్లర్‌ శతక్కొట్టుడు..

సన్‌రైజర్స్‌ ముందు భారీ లక్ష్యం..

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ స్కోర్‌ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11x4, 8x6) శతకంతో చెలరేగాడు. అతడికి కెప్టెన్‌ సంజూ శాంసన్‌(48; 33 బంతుల్లో 4x4, 2x6) మంచి సహకారం అందించాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. అంతకుముందు యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(12) విఫలమయ్యాడు. జట్టు స్కోర్‌ 17 పరుగుల వద్ద రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయాడు. అనంతరం బట్లర్‌, సంజూ సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా బట్లర్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే శతకం పూర్తి చేసి మరింత దూకుడుగా ఆడాడు. అయితే, విజయ్‌ శంకర్‌ వేసిన 17వ ఓవర్‌లో సంజూ.. అబ్దుల్‌ సమద్‌ చేతికి చిక్కి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై సందీప్‌ శర్మ వేసిన 19వ ఓవర్‌లో చివరి బంతికి బట్లర్‌ బౌల్డయ్యాడు. చివరికి రియాన్‌ పరాగ్‌(15), డేవిడ్‌ మిల్లర్‌(7) నాటౌట్‌గా నిలిచి సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని 221గా నిర్దేశించారు. హైదరాబాద్‌ బౌలర్లలో రషీద్‌, విజయ్‌ శంకర్‌, సందీప్‌ శర్మ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని