INDvsPAK: ఒత్తిడిని ఎదుర్కోవాలంటే భారత్‌తో ఆడాలి

తాజా వార్తలు

Published : 12/07/2021 01:15 IST

INDvsPAK: ఒత్తిడిని ఎదుర్కోవాలంటే భారత్‌తో ఆడాలి

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ జునైద్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఒక స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సమీప భవిష్యత్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లుండవని అంచనా వేశాడు.

‘పాక్‌ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలి. రెండు జట్లపైనా ఒత్తిడనేది చాలా ఉంటుంది. ఆ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా క్రికెట్ జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ.. పరిస్థితులను చూస్తే సమీప భవిష్యత్‌లో అది జరిగేలా అనిపించడం లేదు. అలాగే నేను 2012-13లో టీమ్‌ఇండియా పర్యటనకు వెళ్లినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. అప్పుడే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. దాంతో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగితే ఇరు జట్ల ఆటగాళ్లకు చాలా మంచిది. అది రెండు దేశాల అభిమానులను సంతోషపెడుతుంది’ అని పాక్‌ పేసర్‌ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌ చివరిసారి భారత్‌లో పర్యటించినప్పుడు ఆ జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. అందులో జునైద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మూడు వన్డేల్లో అతడు విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయడం విశేషం. ఆ సిరీస్‌లో కోహ్లీ మొత్తం 13 పరుగులే చేశాడు. ఆ పర్యటన తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా దాయాది జట్లు ఐసీసీ ఈవెంట్లు, లేదా ఆసియాకప్‌లో పోటీపడుతున్నాయి. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ చిరకాల ప్రత్యర్థిని ఓడించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని