Williamson భారతీయుడు అయ్యుంటే..!
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Williamson భారతీయుడు అయ్యుంటే..!

కోహ్లీతో పోలుస్తూ వాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నింటా సమానమేనని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచరుల సంఖ్య పరంగానే వారిద్దరికీ తేడా ఉందని పేర్కొన్నాడు. కేన్‌ భారతీయుడైతే వాణిజ్య ఒప్పందాల ద్వారా విరాట్‌ స్థాయిలో డబ్బులు సంపాదించేవాడని అంటున్నాడు. వాన్‌ ప్రతిసారీ  వెటకారంగా మాట్లాడే సంగతి తెలిసిందే.

‘మూడు ఫార్మాట్లు ఆడే గొప్ప ఆటగాళ్లలో కేన్‌ విలియమ్సన్‌ ఒకడు. అతడు విరాట్‌ కోహ్లీకి కచ్చితంగా సాటి. కాకపోతే అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్‌ అనుచరులు లేరంతే. కోహ్లీ తరహాలో వాణిజ్య ఒప్పందాల ద్వారా 30-40 మిలియన్‌ డాలర్లు  ఏటా సంపాదించడు. ఇక నాణ్యత, మైదానంలో అనుభవం, నిలకడ పరంగా చూస్తే కేన్‌ ఎక్కువ పరుగులు చేస్తాడు. ఉదాహరణకు 3 టెస్టుల్లో కేన్‌, 6 టెస్టుల్లో విరాట్‌ను పోలిస్తే ప్రొ రేటా ప్రకారం ఈ వేసవిలో విలియమ్సన్‌ ఎక్కువ పరుగులు చేయగలడు’ అని వాన్‌ అన్నాడు.

‘కేన్‌ విలియమ్సన్ భారతీయుడైతే అతడే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు అవుతాడు. సోషల్‌ మీడియాలో మీరు ఒప్పుకోరు కాబట్టి విరాట్‌ కోహ్లీ గొప్ప కాదని అనను’ అని గతంలో వాన్‌ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నంబర్‌వన్‌ టెస్టు బ్యాట్స్‌మన్‌ అయిన కేన్‌ 2020లో ఆడిన 4 టెస్టుల్లో 83 సగటుతో పరుగులు చేశాడు. 2021లో ఆడిన ఒక టెస్టులో 238 పరుగులు సాధించాడు. మరోవైపు ఐదో ర్యాంకులో ఉన్న కోహ్లీ 2020లో 19.33 సగటుతో పరుగులు చేశాడు. 2021లో 4 మ్యాచుల్లో 172 చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని