నీటిపైనే ప్రాణం పోయింది 

తాజా వార్తలు

Updated : 23/03/2021 10:02 IST

నీటిపైనే ప్రాణం పోయింది 

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై రయ్‌మని దూసుకెళ్లడంలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ నీళ్లే ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.. చివరికి నీటిలోనే ప్రాణాలు వదిలింది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే దురదృష్టవశాత్తూ పిడుగుపాటుకు గురై కన్నుమూసింది. ఆమే.. సాల్వడోర్‌కు చెందిన 22 ఏళ్ల కేథరిన్‌ డియాజ్‌. ఆ దేశంలోని అగ్రశ్రేణి సర్ఫర్‌ అయిన తను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్‌ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన తను.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ టుంకో బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. ‘‘మా దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్‌ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప యోధురాలు. దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది’’ అని ఆ దేశ సర్ఫ్‌ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని