ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. ఇదే ఒప్పుకుంటారు..
close

తాజా వార్తలు

Updated : 26/02/2021 09:55 IST

ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. ఇదే ఒప్పుకుంటారు..

పింక్‌బాల్‌ టెస్టుపై కెవిన్‌ పీటర్సన్‌ ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో జరిగిన తాజా పింక్‌ బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం అటు అభిమానులకే కాకుండా ఇటు మాజీ క్రికెటర్లకూ మింగుడుపడటంలేదు. ప్రపంచంలోనే మేటి జట్లుగా పేరొందిన టీమ్‌ఇండియా X ఇంగ్లాండ్‌ జట్ల మధ్య డే/నైట్‌ టెస్టు అంటే.. పోరు హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు‌. కానీ ఎవరూ ఊహించని విధంగా కేవలం 140 ఓవర్లలో ఐదు సెషన్లలోనే ఫలితం తేలిపోయింది. ఈ క్రమంలోనే కొత్తగా నిర్మించిన మొతేరా పిచ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. టెస్టు క్రికెట్‌కు ఇది సరైన పిచ్‌ కాదని పలువురు టీమ్‌ఇండియా మాజీలు సైతం విమర్శలు చేశారు.

ఇక ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేస్తూ అందులో ఇలా చెప్పుకొచ్చాడు. ‘‘రెండు జట్లలోనూ బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. పేలవంగా ఆడామనే ఒప్పుకుంటారు. ఇక మొత్తంగా 30లో 21 వికెట్లు.. నేరుగా వికెట్‌ టు వికెట్‌ విసిరిన బంతులకే దక్కాయి’’ అని తెలిపాడు. పిచ్‌తో ఎలాంటి ప్రమాదం లేదని, బ్యాట్స్‌మెన్‌ కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉందని ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ వివరించాడు. అలా ఆడి ఉంటే ఈ మ్యాచ్‌ మూడు లేదా నాలుగు రోజులకు వెళ్లేదన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌటైంది. ఆపై భారత్‌ 145 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 81కే పరిమితమైంది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 33 పరుగులు కలుపుకొని మిగతా 49 పరుగులు సాధించి ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు కూడా విజయం సాధిస్తే టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌తో తలపడుతుంది. ఒకవేళ  డ్రా చేసుకున్నా భారత్‌కు అవకాశం ఉంది. కానీ, అనూహ్యంగా ఇంగ్లాండ్‌ గెలిచి సిరీస్‌ 2-2తో డ్రా అయితే మాత్రం ఆస్ట్రేలియా టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని