Olympics: సైనా, శ్రీకాంత్‌కు దారులు ముసుకుపాయే!

తాజా వార్తలు

Published : 28/05/2021 19:43 IST

Olympics: సైనా, శ్రీకాంత్‌కు దారులు ముసుకుపాయే!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే దారులన్నీ మూసుకుపోయాయి. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడానికి చివరి అవకాశంగా ఉన్న సింగపూర్‌ ఓపెన్‌ సైతం తాజాగా కరోనా వైరస్‌ కారణంగా రద్దయింది. దాంతో వారికున్న ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్‌ అర్హతకు సంబంధించి ఇకపై ఎలాంటి పోటీలు ఉండవని, ర్యాంకింగ్స్‌లోనూ మార్పులుండవని ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌(బీడబ్ల్యూఎఫ్‌) శుక్రవారం స్పష్టం చేసింది. 

కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే క్రీడాకారులు జూన్‌ 15 వరకు తగిన పాయింట్లు తెచ్చుకోవాలని బీడబ్ల్యూఎఫ్ ఇది వరకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఇండియా ఓపెన్‌, మలేషియా ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌ జరగాల్సి ఉన్నా కరోనాతో ఆ మూడు టోర్నీలు రద్దయ్యాయి. దాంతో సైనా, శ్రీకాంత్‌కు అన్నిదారులు మూసుకుపోయాయి. క్రీడాకారులకు జూన్‌ 15 వరకు తుది గడువు ఉన్నా.. అప్పటికీ ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఎలాంటి తేడాలుండవని, బీడబ్ల్యూఎఫ్‌ అభిప్రాయపడింది. దాంతో అప్పటికి టాప్‌ 16లో చోటు దక్కించుకున్న వారికి నేరుగా ప్రవేశాలు ఉంటాయని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. మరోవైపు భారత్‌ నుంచి పీవీ సింధు, సాయి ప్రణీత్‌, పురుషుల డబుల్స్‌ జోడీ చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌ లాంటివారు ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని