IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. 

తాజా వార్తలు

Updated : 23/09/2021 19:20 IST

IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. 

ఇంటర్నెట్ డెస్కు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో భాగంగా అబుదాబి వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్‌ (ఎంఐ), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మధ్య ఈ మ్యాచ్‌ జరుగనుంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైన ముంబయి.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు, బెంగళూరుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. మలి దశలో శుభారంభం చేసిన కోల్‌కతా అదే జోష్‌ను కొనసాగించాలనుకుంటోంది.  

ముంబయి ఇండియన్స్‌ జట్టు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డి కాక్ ‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, సౌరభ్‌ తివారీ, కీరన్‌ పొలార్డ్, కృనాల్‌ పాండ్య, ఆడమ్‌ మిల్నే, రాహుల్‌ చాహర్‌, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు..

వెంకటేశ్‌ అయ్యర్, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌ కీపర్‌), ఆండ్రూ రస్సెల్‌, సునీల్‌ నరైన్, లాకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని