Team India: కోహ్లీ, రహానెకు విశ్రాంతి.. రోహిత్‌కు పగ్గాలు

తాజా వార్తలు

Published : 20/07/2021 17:00 IST

Team India: కోహ్లీ, రహానెకు విశ్రాంతి.. రోహిత్‌కు పగ్గాలు

డరమ్‌: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా నేటి నుంచి కౌంటీ XI జట్టుతో రివర్‌సైడ్‌ మైదానంలో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఇందులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ఆడటం లేదు. వారు విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్‌ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. మరోవైపు సీనియర్‌ ఆటగాళ్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి సైతం ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారి, కేఎల్‌ రాహుల్‌..తదితర ఆటగాళ్లను ఈ వార్మప్‌ మ్యాచ్‌లో తుదిజట్టులోకి తీసుకున్నారు. దాంతో వీరందరు ఎలా ఆడతారనేది జట్టు యాజమాన్యం పరిశీలించనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆడని కోహ్లీ, రహానె, జడేజా, అశ్విన్‌ లాంటి ఆటగాళ్లు నెట్స్‌లో సాధన చేస్తారని సమాచారం. అలాగే ఈనెల 26 నుంచి మూడు రోజులు జరిగే ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో వీరంతా తలపడే అవకాశం ఉంది. అప్పటికి రిషభ్‌ పంత్‌, సాహా కూడా జట్టుతో కలిసే వీలుంది. కాగా, ఈరోజు ప్రారంభమైన వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, కేఎల్‌ రాహుల్‌ (కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని